కొత్తకోట, వెలుగు : క్యారెట్ ముక్క ఊపిరితిత్తుల మధ్యలో ఇరుక్కొని ఊపిరాడక స్పృహ కోల్పోయిన ఏడాది చిన్నారిని పీడియాట్రిక్ బ్రాంకో స్కోపీ ద్వారా వైద్యులు కాపాడారు. కొత్తకోటకు చెందిన జహిర్ దంపతుల రెండో కుమార్తె ఫిజ్జా క్యారెట్ తిని ఉక్కిరిబిక్కిరి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికి రాహుల్ ఆస్పత్రికి తరలిచారు. ఊపిరితిత్తుల మధ్య క్యారెట్ముక్క ఇరుక్కున్నట్లు గుర్తించిన వైద్యులు..
వెంటిలేటర్ ద్వారాకృతిమ శ్వాస అందించారు. అనంతరం పల్మోనాలజిస్ట్ వెంకట్ రెడ్డి బృందం బ్రాంకోస్కోపీ చేసి చిన్నారి ప్రాణాలను కాపాడింది. దాదాపు 48 గంటలపాటు ఈ ట్రీట్మెంట్ చేసినట్లు వైద్యులు తెలిపారు. వనపర్తి జిల్లాలో బ్రాంకోస్కోపీ సర్జరి చేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.