పెద్దపల్లి టికెట్‌‌‌‌‌‌‌‌ గడ్డం వంశీకే ఇవ్వాలి

గోదావరిఖని, వెలుగు: లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌ గడ్డం వంశీకృష్ణకే కేటాయించాలని ఆ పార్టీ నేత పి.మల్లికార్జున్​ ఓ ప్రకటనలో హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను కోరారు. పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ అభివృద్ధికి దివంగత నేత కాకా వెంకటస్వామి, ఆ తర్వాత ఆయన కొడుకు వివేక్​ఎంతో కృషి చేశారన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు యువనేత గడ్డం వంశీకృష్ణకు టికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలన్నారు.

కేంద్రమంత్రిగా కాకా సింగరేణి కార్మికులకు పెన్షన్​ విధానాన్ని తీసుకొచ్చారన్నారు. వివేక్​ ఎంపీగా ఉన్నప్పుడు మూసివేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని అప్పటి పీఎం మన్మోహన్​ సింగ్​ను ఒప్పించి రూ.10 వేల కోట్ల అప్పును మాఫీ చేయించి బీఐఎఫ్​ఆర్​ నుంచి బయటపడేశారని గుర్తుచేశారు. పార్లమెంట్​ పరిధిలో రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జిల  నిర్మాణం, రోడ్ల విస్తరణకు కాకాతో పాటు వివేక్​ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. విశాక చారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా చాలా గ్రామాల్లో బోర్​వెల్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి నీటి ఎద్దడి తీర్చారన్నారు.