- మూతపడి రెండేండ్లయినా కొత్తది కడ్తలేరు
- బాయ్స్కాలేజీ ల్యాబ్‌ల్లో క్లాసుల నిర్వహణ
- సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్న గర్ల్స్
- రూ. 2 కోట్లతో ప్రపోజల్స్ పంపినా బిల్డింగ్ శాంక్షన్ కాలే...
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గర్ల్స్జూనియర్ కాలేజీ బిల్డింగ్ శిథిలమైంది. దాన్ని రెండేళ్ల క్రితమే మూసేశారు. దీంతో గర్ల్స్ ఇంటర్క్లాస్లు బాయ్స్ జూనియర్‌కాలేజీ ల్యాబ్‌ల్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ సరైన సౌకర్యాల్లేక గర్ల్స్ఇబ్బందులు పడుతున్నారు. బిల్డింగ్ కోసం అప్పట్లోనే సర్కార్‌కు రూ.2 కోట్లతో ప్రపోజల్ పంపారు. అంచనాలను సవరించి తాజాగా రూ.. 4 కోట్లతో ప్రతిపాదనలు పంపినా సర్కార్‌లో చలనం లేదు.
రెండేండ్లయినా పట్టించుకుంటలేరు...
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీ శిథిలావస్థకు చేరింది. ఈ విషయమై ప్రిన్సిపాల్ ఇంటర్ బోర్డుతోపాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. రెండేండ్లుగా బాయ్స్ కాలేజీ ల్యాబ్‌లు, ఇతర గదుల్లో గర్ల్స్‌కు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్ సైన్స్ గ్రూపులకు ప్రాక్టికల్స్ చేసేందుకు ల్యాబ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. బాయ్స్ క్యాంపస్కావడంతో గర్ల్స్ స్టూడెంట్స్ టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలేజీకి పెద్దపల్లి సమీప గ్రామాల నుంచి వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందినవారే. మూడేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్, సిబ్బంది ఇంటింటి ప్రచారం చేసి జాయిన్ చేసుకున్నారు. కాగా సౌకర్యాల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు
కాలేజీ బిల్డింగ్సమస్యను ఎవరికీ చెప్పినా ప్రయోజనం లేదని స్టూడెంట్స్, విద్యార్థి సంఘాల లీడర్లు పేర్కొంటున్నారు. దీనిపై ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డితోపాటు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థులు చాలాసార్లు కొత్త బిల్డింగ్ కోసం ఆందోళన చేశారు. రెండేళ్ల క్రితం ఇంటర్మీడియట్ జిల్లా అధికారులు ప్రపోజల్స్ పంపడంతో స్టేట్బోర్డ్అధికారులు కాలేజీని పరిశీలించి వెళ్లారు. ఆ తర్వాత పట్టించుకోలేదు.
ప్రభుత్వం దృష్టికి తీసుకపోయినం
గర్ల్స్ కాలేజీ కొత్త బిల్డింగ్ కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్పంపినం. గతేడాది ఇంటర్ బోర్డు అధికారులు కాలేజీ పాత బిల్డింగును పరిశీలించి కొత్త బిల్డింగ్అవసరాన్ని గుర్తించారు. తొందరలోనే గర్ల్స్ కాలేజీకి బిల్డింగ్ మంజూరయ్యే అవకాశం ఉంది.
- కల్పన, డీఐఈవో, పెద్దపల్లి