పెద్దపల్లి జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో పసికందు మృతి చెందింది. నిన్న ( జూన్ 14) న డెలివరీ కోసం కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లి కి చెందిన మమత అనే గర్భిణీని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె భర్త నాగార్జున తీసుకొచ్చారు.
నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించి కడుపులో పసిపాప చనిపోయిన తర్వాత ఆపరేషన్ చేసి వెలికి తీశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రాణం పోయాల్సిన డాక్టరే ప్రాణం తీసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ ను సస్పెండ్ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మాతా శిశు ఆసుపత్రి సూపరింటెండ్ శౌరయ్య, డాక్టర్ శ్రీదేవి పై కేసు నమోదు చేసిన పెద్దపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.