PEELINGS Video Song Out: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన కలసి జంటగా నటించిన చిత్ర పుష్ప 2 : ది రూల్. ఇది 2021లో రిలీజ్ అయినా పుష్ప: ది రైజ్ సినిమా సీక్వెల్. భారీ అంచనాల నడుమ పుష్ప 2 డిసెంబర్ 05న రిలీజ్ కాగా ఫ్యాన్స్ అంచనాలని ఏమాత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఇండస్ట్రీ హిట్ కొట్టి పలు రికార్డులు బ్రేక్ చేసి, క్రియేట్ చేసి ఔరా అనిపించింది. అయితే పుష్ప 2 కమర్షియల్ గా మాత్రమేకాకుండా మ్యూజికల్ గా మంచి హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా ఫుల్ వీడియో సాంగ్స్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
అయితే ఈరోజు పుష్ప 2 సినిమాలోని పీలింగ్స్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారిక సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలిపారు. ఈ పాటని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. లిరిక్ రైటర్ చంద్రబోస్ లిరిక్స్ అందించగా శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాస్ పాడారు. ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేసిన 3 గంటల్లోనే దాదాపుగా 261000 పై చిలుకు వ్యూస్ వచ్చాయి. ఈ పాటని చూసిన ఫ్యాన్స్ బన్నీ డ్యాన్స్ ఇరగదీశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ | Prabhas Injure Update: ఏం లేదు టెన్షన్ పడొద్దు : షూటింగ్ లో ప్రభాస్ కు చాలా చిన్న గాయం..
ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలు కావస్తున్నా ఇప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. దీంతో 12 రోజుల్లోనే రూ.567 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో హిందీలో అతి తక్కువ సమయంలోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన తొలి తెలుగు, ఇండియన్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.