వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం

మన పూర్వీకులు ఔషధంగా ఉపయోగించే వాటిని విస్మరించి పాశ్చాత్య వైద్యాన్ని ఆశ్రయించిన ఫలితంగా ఇప్పుడు మనం చాలా చిన్న వయస్సులోనే అనేక వ్యాధులకు గురవుతున్నాము. రావి చెట్టును మన పూర్వీకుల కాలం నుంచి ఎంతగానో ఉపయోగిస్తున్నారు. రావి చెట్టు ఆకుల వలన కూడా మీకు అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.

మన పూర్వీకులు ఎక్కువకాలం జీవించే వారు. 90 ఏళ్లు దాటినా అలుపు.. సొలుపు లేకుండా పనిచేసేవారు.  కోడి కూసింది మొదలు.. సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా పని చేసినా అలసట అనే మాటే  ఎరుగకుండా జీవితం గడిపారు. అయితే ఇప్పుడు 20 ఏళ్లకే ఆపసోపాలు పడుతూ.. అమ్మా.. అబ్బా అంటున్నారు.  గట్టిగా కదలకుండా మూడు గంటలు పని చేస్తే అలసి పోతారు. గట్టిగా ఏదైనా నమిలితే చాలు పళ్లను చేత్తో తీసుకుంటున్నారు.  అయితే మన పూర్వీకుల  ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రధాన కారణం వారు ప్రకృతిపై ఆధారపడి జీవించడం. ఇప్పటి తరంలా ప్రకృతిని నాశనం చేయడం కాదు. నాగరికత పేరుతో మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాం. 

మన పూర్వీకులు ఉపయోగించే ముఖ్యమైన పదార్థాలలో ఒకటి రావి చెట్టు ఆకు. అంతకు ముందు అన్ని వీధుల్లో రావి వృక్షం కనిపించేది. ఇప్పటికీ కొంతమంది ఇంటికి దగ్గరగా ఈ చెట్టు కనిపిస్తూ ఉంటుంది. ఊర్లో రచ్చబండ దగ్గరైనా రావి చెట్టు కనిపించడం అనేది ఉంది. ఈ చెట్టు ప్రాణవాయువును సమృద్ధిగా అందించగలదు. కానీ నిజానికి రావి చెట్టు ఆకు అత్యుత్తమ మూలిక. ఈ చెట్టు ఆకుల గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి.

  • రావి చెట్టు ఎక్కువగా  అడవులలో, ఇంటి సమీపంలోని కొన్ని ప్రదేశాలలో కనిపిస్తుంది. దీని ఆకులలో టానిక్ యాసిడ్, అస్పార్టిక్ యాసిడ్, స్టెరాయిడ్, విటమిన్లు, మెథియోనిన్, గ్లైసిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ రావి చెట్టు ఆకులను అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా మారుస్తాయి. కానీ మనకు ఈ ఆకులను మనకు ఎక్కువగా ఉపయోగించం. అందుకే పల్లెటూళ్లలో రావిచెట్టు చుట్టూ రచ్చబండ కట్టి.. సాయం వేళలో జనాలు అక్కడ కూర్చొనేవారు.
  • నిరంతర జలుబు, జ్వరంతో బాధపడేవారు రావి చెట్టు ఆకులను పాలతో మరిగించి అందులో పంచదార వేసి రోజుకు రెండు పూటలా తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది. 
  • రావి చెట్టు ఆకులే కాదు కాయల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. ఈ చెట్టు ఆకులు మరియు కాయలను తీసుకుని పొడిగా చేసుకోవాలి. అప్పుడు వాటిని సమానంగా కలపండి. ఈ పొడిని నీళ్లలో కలిపి 14 రోజుల పాటు నిరంతరం తాగితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. నరాల సమస్యకు ఇది మంచి ఔషధం
  • రావి చెట్టు ఆకుల పాలు కంటి నొప్పికి అద్భుతమైన ఔషధం. కంటి నొప్పులున్నప్పుడు రావి చెట్టు ఆకులను పిండుకుని కళ్లపై రాసుకుంటే కొద్ది నిమిషాల్లోనే నొప్పులు తగ్గుతాయి.
  • కాలిన ఆకులు లేదా  తాజా వేరుతో మీ దంతాలను బ్రష్ చేయడం వలన దంతాల నుండి మరకలు తొలగిపోతాయి. బ్యాక్టీరియా దాడి నుండి దంతాలను కాపాడుతుంది.
  • రావి వృక్షంలోని ఆకులను తీసుకుని రసం తీసి, దానికి కొంచెం తాటి పంచదార వేసి రోజుకు మూడుసార్లు తాగాలి. ఇది ప్రారంభ దశలోనే కామెర్లు నయం చేయగలదు.
  • దీని ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంపై దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. తినడానికి ఇష్టపడకపోతే ఆకులను ఉపయోగించి టీ తయారు చేసి తాగవచ్చు.
  • కొన్ని ఆకులను తీసుకుని వాటిని నల్ల బీన్స్‌తో పాటు బాగా రుబ్బుకోవాలి. నీటితో బాగా కలపండి. ఫిల్టర్ చేయండి. ఈ నీటిని రోజూ తాగడం వల్ల కాలేయం రక్షిస్తుంది. అతిగా మద్యపానం చేసేవారు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • రావి ఆకులు మలబద్ధకం నయం చేయడానికి ఉత్తమ ఔషధం. కొద్దిగా రాయల్ జెల్లీ పొడి, సోంపు, బెల్లం తీసుకోండి. పడుకునే ముందు పాలలో కలిపి తాగాలి. తక్షణ ఉపశమనం గంటల వ్యవధిలో అనుభూతి చెందుతుంది.
  • కొన్ని లేత ఆకులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే వడకట్టిన నీటిని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల గుండె దడ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • మధుమేహం సమస్య ఉన్నవారు రావి ఆకుల పొడి, ఆవాల పొడిని సమపాళ్లలో పాలలో కలిపి తాగితే శరీరంలో షుగర్ లెవెల్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.
  • రావి చెట్టు గింజల పొడిని కొద్ది మొత్తంలో తేనెతో కలిపి రోజూ సేవిస్తే రక్తం శుద్ధి అవుతుంది. గ్యాస్ట్రిక్ డిజార్డర్స్‌తో బాధపడేవారు దీన్ని డికాక్షన్‌గా చేసుకుని టీతో కలిపి తాగితే త్వరగా కోలుకుంటారు.

  •