హైదరాబాద్, వెలుగు: ఎంటర్‌ప్రైజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్ ప్రొవైడర్ ‘పెగా’... ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం యూనివర్సిటీ అకడమిక్ ప్రోగ్రామ్ (యూఏపీ) ఇంటర్న్‌షిప్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా భారత్‌లో సర్టిఫైడ్ సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్స్ (సీఎస్ఎస్ఏ) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాన్ని పెంపొందిస్తారు.
వంద మందికి పైగా విద్యార్థులకు పెగా సాఫ్ట్వేర్లపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు. రెండు వారాల పాటు ఈ ప్రోగ్రామ్‌కు హాజరయ్యే వారు పెగా టెక్నాలజీలలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారని పెగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వివరించారు.