కలకలం రేపిన పావురం !

కలకలం రేపిన పావురం !

నేలకొండపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో కాలికి చైనా లాంగ్వెజ్​ ట్యాగ్​తో వచ్చిన పావురం కలకలం రేపింది. బత్తుల నాగేశ్వరావు తన పొలంలో పని చేసుకుంటుండగా ఓ పావురం కనిపించింది. కాలికి ఏదో ఉండడంతో  వెంబడించి పట్టుకున్నాడు. గమనించి చూడగా ఐదు నంబర్ల కోడ్ తో పాటు దానిపై చైనా లాంగ్వేజ్​ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్​ఐ భవాని, పోలీసులు ఆ పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడతామన్నారు.