Peka Medalu Movie:పేకమేడలు నిర్మాతల సాహసం..యాభై రూపాయ‌ల‌కే మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా..ఇక నుండి ఒకటే రూల్!

Peka Medalu Movie:పేకమేడలు నిర్మాతల సాహసం..యాభై రూపాయ‌ల‌కే మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా..ఇక నుండి ఒకటే రూల్!

‘నా పేరు శివ’ ఫేమ్ వినోద్‌‌‌‌ కిషన్‌‌‌‌, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రాకేష్ వర్రే నిర్మించిన చిత్రం ‘పేక మేడలు’(Peka Medalu).ఈ మూవీ శుక్రవారం (జులై19న) విడుదల కానుంది. బాహుబలిలో ముఖ్య పాత్ర పోషించిన రాకేష్ వర్రే ఈ చిత్రాన్ని నిర్మించాడు. 

తాజా సమాచారం మేరకు..పేక మేడలు సినిమా థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని కొనుగోలు చేసారు. ఇవాళ గురువారం హైద‌రాబాద్‌లోని ప‌లు మ‌ల్టీప్లెక్స్‌ల‌లో పేక‌మేడ‌లు మూవీ పెయిడ్ ప్రీమియ‌ర్స్‌ను స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు.

అయితే, ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌లోకి ర‌ప్పించేందుకు పేక‌మేడ‌లు మూవీ టీమ్ టికెట్ రేట్ల‌నుతగ్గించారు. ఈ సినిమా ప్రతిఒక్కరికీ  చేరేవిధంగా పెయిడ్ ప్రీమియర్స్ మ‌ల్టీప్లెక్స్‌లో టికెట్ ధర రూ.50 లకు మేక‌ర్స్ ఫిక్స్ చేశారు. ఇకపోతే రెగ్యుల‌ర్ టికెట్ ధ‌ర‌ల‌ను (శుక్రవారం షోస్) నుంచి రూ.100 మాత్రమే ఉండేలా నిర్ణ‌యించారు. కాగా..బుధవారం పేకమేడలు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. 

Also Read:ఫిల్మ్ ఫేర్ అవార్డులలో సత్తా చాటిన .. విరాట పర్వం, గార్గి

ఇందులో డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.."ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చాలా సినిమాలు చూసాను, కానీ పేకమేడలు కథ కథనం చాలా బాగా నచ్చి ఈ సినిమా రైట్స్ ను వెంటనే కొనుగోలు చేశాం. అయితే, పెద్ద సినిమాల‌కు ఎంత రేట్ ఫిక్స్ చేసిన ఆడియన్స్ థియేటర్ కు వస్తారు. కానీ చిన్న సినిమాలు కి తక్కువ రేట్లు ఉంటే కానీ రారు. అందుకే పేక మేడ‌లు టికెట్ రేట్లను వంద‌కు తగ్గించాం. పెద్ద సినిమాలతో పోటీ పడలేక చిన్న సినిమాలు చాలావరకు  ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే, చిన్న సినిమాల్లో కంటెంట్ బాగున్నపుడు ప్రతిఒక్క ఆడియన్స్ థియేటర్ కు వచ్చి చూడాలంటే చిన్న నిర్మాతలు ఈ రూల్ పాటిస్తే వారి సినిమాలు ఎక్కువ మంది చూస్తారు” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సాధారణంగా మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే క‌నీసం రూ.300 నుంచి రూ.400ల వరకు టికెట్ల రేట్లు ఉంటాయి. ఇక రిక్లైన‌ర్స్ సీట్స్ అయితే చెప్పేదేలేదు రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించాల్సిందే. దీంతో ఇలాంటి రేట్స్ పెట్టి సినిమాలు చూడాలంటే ఆడియన్స్ కు అధిక భారం తప్పితే..ఇంకేం లేదు. ఇప్పుడున్న అధిక టికెట్ ధ‌ర‌ల‌పై చాలా కాలంగా తెలుగు సినిమా ల‌వ‌ర్స్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అధిక టికెట్ ధరలు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క వంటి పొరుగు రాష్ట్రాల్లో సగంలో సగం తక్కువ రేట్స్ ఉంటాయి. 

అలాంటిది మన తెలుగు స్టేట్స్ లో మాత్రమే ఇలా అధిక రేట్లు పెట్టినప్పుడే థియేటర్లో రిలీజ్ అయ్యే చిన్న సినిమాల‌కు భారీగా న‌ష్టం వాటిల్లుతోంది. అంతేకాదు రూ.300 నుంచి రూ.400ల వరకు ఉన్న ఆడియన్స్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లో సినిమాలు చూడటానికి రాలేకపోతున్నారు. మరి పేకమేడలు మేకర్స్ తీసుకున్న నిర్ణయం చాలా గట్టిదనే చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న సినిమా తీసి అధిక భారం మోసి..ఎవరైనా లాభాలు రావాలనే కదా కోరుకునేది, కానీ, వీరు అందుకు భిన్నంగా టికెట్ ధ‌ర‌లు తగ్గించి ఆడియన్స్ ఆహ్వానిస్తుంటే మెచ్చుకోవాలి. అలాగే ప్రతి ఒకరు సినిమా చూసి వాళ్ళని ఆదరించాలి. అప్పుడే వచ్చే మరో చిన్న సినిమాకు బలం వస్తుంది. 

స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్   ఇతర  పాత్రలు పోషిస్తున్నారు.