మార్చి 21న రిలీజ్ కి సిద్ధంగా పెళ్లి కానీ ప్రసాద్

మార్చి 21న రిలీజ్ కి సిద్ధంగా పెళ్లి కానీ ప్రసాద్

సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి గోపిడి తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. సోమవారం హీరో ప్రభాస్ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘ప్రసాద్‌‌ అనే నేను.. కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్‌‌ అండ్‌‌ రెగ్యులేషన్స్‌‌కు గౌరవం ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా కుటుంబం ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటానని మా తాతముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నా’ అంటూ సప్తగిరి చెప్పే డైలాగ్‌‌తో ప్రారంభమైన టీజర్‌‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది. 

అయితే కట్నం కోసం ఎదురుచూస్తున్న  సప్తగిరికి పెళ్లి మరింత ఆలస్యమవడం హిలేరియస్‌‌గా ఉంది. ప్రియాంక శర్మ హీరోయిన్‌‌గా నటించగా,  మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ , అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించారు. కె.వై. బాబు,  భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు.  మార్చి 21న సినిమా విడుదల కానుంది.