
సప్తగిరి హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకుడు. కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా మార్చి 21న ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ ‘ఇది చాలా ఫన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్. శాసనాల గ్రంథంలో కట్నాల గురించి తాత ముత్తాతల గురించి పొందుపరిచి ఉంటారు. కట్నం
తీసుకోవడంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఆ గ్రంథంలో ఉంటాయి. అందులో ఉన్న రూల్స్ ప్రకారం కట్నం వస్తేనే పెళ్లి జరుగుతుంది. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇది కేవలం ప్రేక్షకులు నవ్వుకోవడానికి చేసిన సినిమా. స్క్రీన్‌ప్లే, సిట్యువేషన్ కామెడీతో ఫన్ రైడ్‌లా ఉంటుంది. వెంకటేష్ గారి కెరీర్‌లో ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లి కాని ప్రసాదు. ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్. ఆ టైటిల్ వెయిట్‌ని కాపాడేలా సినిమా ఉంటుంది. అభిలాష్ కథ చెప్పినప్పుడు చాలా నవ్వాను. ప్రేక్షకులు కూడా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా.
దిల్ రాజు గారి బ్యానర్‌లో సినిమా రిలీజ్ అవడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పాడు.