
పెంబి, వెలుగు: రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీరందక ఎండుతోంది. ఎస్సారెస్పీ డి 28 కెనాల్ ద్వారా అందాల్సిన నీరు అందక పెంబి మండలం మందపల్లిలోని కొత్త చెరువు ఆయకట్టు వరి పంటలు ఎండిపోతున్నాయి.
పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నీరందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి నీరందించాలని కోరుతున్నారు.