పీపీఎల్ విజేత రెయిన్​బో వారియర్స్

పీపీఎల్ విజేత రెయిన్​బో వారియర్స్

పెంబి, వెలుగు: పెంబి మండల కేంద్రంలో గత పది రోజులుగా సాగుతున్న పెంబి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. పది జట్లు పాల్గొన్న ఈ లీగ్​లో ఫైనల్​కు చేరుకున్న రెయిన్​బో వారియర్స్, పెంబి ప్రీమియర్ స్ట్రైకర్ జట్లు ఫైనల్​కు చేరుకొని ఆదివారం హోరాహోరీగా తలపడ్డాయి. ఈ పోరులో రెయిన్​బో వారియర్స్ విజేతగా నిలిచింది.

 విన్నింగ్​జట్టుకు నిర్మల్ ఆదిత్య హాస్పిటల్ రూ.20 వేలు అందించగా, రన్నరప్​కు రూ.10 వేల ప్రైజ్ మనీని నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు నరేశ్, మహేశ్, మతిన్, ఇస్మాయిల్, గణేశ్, షారుఖ్, రామ్, అశోక్, చిట్టి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సల్ల స్వప్నిల్ రెడ్డి, నాయకులు తులాల శంకర్, వీలాశ్, సంతోష్, ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.