ప్రభుత్వ కాలేజీలకు ఫైన్‌పై ఇంటర్ బోర్డు వెనక్కి
హైదరాబాద్, వెలుగు: “అడ్మిషన్ గడువు దాటితే సర్కారు కాలేజీల్లోనూ జరిమానా” హెడ్డింగ్‌తో గురువారం ‘వెలుగు’ పత్రికలో వచ్చిన కథనంపై ఇంటర్ బోర్డు స్పందించింది. జరిమానా.. ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు మాత్రమేనని, సర్కారు కాలేజీలతో పాటు సర్కారు సెక్టార్ కాలేజీల్లోని స్టూడెంట్లకు ఉండదని క్లారిటీ ఇచ్చింది. 3 రోజుల కింద ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు అకడమిక్ ఆఫీసర్ వసుంధరదేవి ఇచ్చిన ఉత్తర్వులు వివా దాస్పదంగా మారాయి. ఈ నెల31 ఎలాంటి ఫైన్ లేదని, కానీ, ఆగస్టు1 నుంచి 16 వరకు అడ్మిషన్లు తీసుకునే వారు రూ.500 ఫైన్ చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.