జీహెచ్ఎంసీ జోన్లలో కుప్పలుగా పెండింగ్ అప్లికేషన్లు

జీహెచ్ఎంసీ జోన్లలో కుప్పలుగా పెండింగ్ అప్లికేషన్లు
  • జడ్సీ టేబుల్స్ నుంచి ఫైళ్లు కదలట్లే
  • టీజీ బీపాస్​ రూల్స్​ పట్టించుకోని బల్దియా ఉన్నతాధికారులు
  • 200కు పైగా ఫైల్స్ పెండింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలోని జోనల్ కమిషనర్ల టేబుళ్ల నుంచి ఫైళ్లు ముందుకు కదలడం లేదు. భవన నిర్మాణాల అనుమతుల కోసం వచ్చిన వందల అప్లికేషన్లను పెండింగ్​పెట్టారు. టీజీ​ బీపాస్ ద్వారా 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నెల రోజులు దాటినా పట్టించుకోవడం లేదని నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తం ఆరు జోన్లలో దాదాపు 200కిపైగా అప్లికేషన్లు పెండింగ్​ఉన్నాయి. ఎక్కువగా ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లిలోనే ఉన్నాయి. పెండింగ్​అప్లికేషన్లలో సగం ఎల్బీనగర్ లోనే ఉన్నాయి.  600 చదరపు గజాలలోపు నిర్మాణాలకు స్పాట్ పర్మిషన్స్ ఇవ్వాలి. 600 చదరపు గజాలు లేదా మూడో ఫ్లోర్ల భవన నిర్మాణాలకు అప్లికేషన్లు వస్తే ముందుగా సూపర్ వైజర్, ఆ తరువాత  అసిస్టెంట్ సిటీ ప్లానర్ చివరగా డిప్యూటీ కమిషనర్ వద్దకు వెళ్తుంది.

ఆన్ లైన్ లో ఇన్ స్టంట్ అనుమతులు వచ్చినప్పటికీ, దానిపై పూర్తి విచారణ జరిగిపి 15 రోజుల్లో విచారణ జరిపి పనులకు అనుమతులు ఇస్తారు. ఇదిలా ఉంటే సింగి ల్ విండో అయితే 1,200 చదరపు గజాల వరకు జోనల్ లేవల్​అనుమతులు జారీ అవుతాయి. అప్లికేషన్​ముందుగా జోనల్ లేవల్​అసిస్టెంట్ సిటీ ప్లానర్ వద్దకు వెళ్తుంది. తరువాత  సిటీ ప్లానర్ వద్దకు, అక్కడి నుంచి జోనల్ కమిషనర్ వద్దకు వెళ్తుంది. అయితే అందరి అప్రూవల్స్ వచ్చినప్పటికీ జోనల్ కమిషనర్ల వద్ద పెండింగ్ లో ఉన్నాయి.