హైదరాబాద్: రేపట్నుంచి మార్చి 30వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ అమల్లో ఉంటుందన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. టూవీలర్స్ పై పెండింగ్ చలాన్లపై 75 శాతం మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. నో మాస్క్ కేసుల్లో వేయ్యి రూపాయలకు 100 కడితే చాలన్నారు. ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్లు చెల్లించాలన్నారు . ఈ-చ లాన్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించొచ్చని చెప్పారు. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే కూడా అమౌంట్ చెల్లించొచ్చని సూచించారు.
టూ, త్రీ వీలర్ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై 75శాతం మాఫీ చేయగా.. 25శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50శాతం, తోపుడు బండ్లకు 75శాతం, నో మాస్క్ కేసుల్లో రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో చలాన్లు కట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. రెండు సంవత్సరాలు కొవిడ్ పరిస్థితుల క్రమంలో జనం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్నందున పోలీసుశాఖ పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది.
మరిన్ని వార్తల కోసం: