- తెలంగాణ రాష్ర్ట విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
సదాశివనగర్, వెలుగు : పెండింగ్పాల బిల్లులను త్వరలోనే చెల్లిస్తామని తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో విజయ డెయిరీ ఆఫీస్లో కామారెడ్డి జిల్లా విజయ డెయిరీ అధ్యక్షుడు చింతకుంట తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన బీఎంసీ అధ్యక్షులతో కలిసి చైర్మన్కు పెండింగ్ బిల్లులపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పాడి రైతులు బిల్లుల విషయంలో ఆధైర్యపడ్డవద్దన్నారు. రైతులకు విజయ డెయిరీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.
పాడి రైతుల కోసం ప్రభుత్వం గడ్డి విత్తనాలు, పశుదాణా, మినరల్ మిక్చర్, కాల్షియంను త్వలోనే బీఎంసీల ద్వార పాల సేకరణ కేంద్రాలకు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా విజయ డెయిరీ అధ్యక్షుడు చింత కుంట తిరుపతి రెడ్డి, నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.