![బాల పురస్కారం అందుకున్న పెండ్యాల లక్ష్మీ ప్రియ](https://static.v6velugu.com/uploads/2024/01/pendyala-lakshmi-priya-who-received-the-child-award_WqOR526UeI.jpg)
- రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ కు చెందిన పెండ్యాల లక్ష్మీ ప్రియ(14) ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం(పీఎం ఆర్ బీపీ) అందుకున్నారు. కూచిపూడి నృత్యంలో లక్ష్మీ ప్రియ కనబరిచి న ప్రతిభకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. మంగళ వారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పిల్లలు ఈ అవార్డులు అందుకున్నా రు.
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడా రు. పిల్లలు ఏదో ఒక క్రీడల్లో ప్రావీణ్యం సాధిం చడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. పెద్దలను గౌరవించాలని తెలిపారు. ఈ ప్రోగ్రాం అనంతరం బాల పురస్కార్ గ్రహీతలతో ప్రధాని మోదీ లోక్ కల్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో ముచ్చ టించా రు. ఈ సందర్భంగా వారి ధైర్య సాహ సాలు, కళలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకున్నారు.