పెన్​గంగ జాతర షురూ

ఆదిలాబాద్‍ అర్బన్‍, వెలుగు: మహారాష్ట్రలోని పఠాన్ బోరి సంస్థాన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే పెన్​గంగ జాతర ఆదివారం ప్రారంభమైంది. మహారాష్ట్ర సరిహద్దు జైనథ్ మండలం డోలారా గ్రామ సమీపంలో రెండు రాష్ట్రాలను పెన్​గంగ వేరు చేస్తోంది. ఈ నదికి సంబంధించి 131 సంవత్సరాలుగా జాతర నిర్వహిస్తున్నారు. ఐదు రోజులపాటు కొనసాగే జాతరకు మహారాష్ట్రతో  పాటు  ఆదిలాబాద్​ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. నదీమా తల్లికి పూజలు చేస్తారు. అందులో భాగంగానే ఆదివారం స్వామి రామానంద్ మహారాజ్, మాధవరాజ్ మహారాజ్ పాదుకలను పఠాన్ బోరి నుంచి తీసుకువచ్చారు.  వాటిని నది సమీపంలో నిర్మించిన చిన్నపాటి ఆలయాల్లో ఉంచి ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభించారు.