ఏదైనా నేరం చేసి జైలుకు వెళితే నేరం తీవ్రతను బట్టి ఏడాది, నాలుగేళ్లు మహా అయితే 14ఏళ్ళ యావజ్జీవ శిక్ష పడుతుంది. కొన్ని సందర్భాల్లో అధిక నేరాలు ఒకేసారి రుజువైతే కోర్టులు 20ఏళ్ళు, 30ఏళ్ళు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఏకంగా 760ఏళ్ళ జైలు శిక్ష పడటం విన్నారా ఎప్పుడైనా... అవును మీరు విన్నది నిజమే, పెన్సిల్వేనియాలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ హాస్పిటల్లోని నర్సు లెథల్ ఇన్సులిన్ ఇవ్వటం వల్ల 17మంది మరణించిన కేసులో సదరు నర్సుకు 760ఏళ్ళ జైలు శిక్ష పడింది.
హెదర్ ప్రేస్డీ అనే 41ఏళ్ళ నర్సుపై నమోదైన మర్డర్ కేసులు, అట్టెంప్ట్ టు మర్డర్ కేసులకు గాను ఉరి శిక్షతో పాటు 380నుండి 760ఏళ్ళ జైలు శిక్ష ఖరారైంది. 2020 నుండి 2023 వరకు నమోదైన వేరు వేరు కేసులకు గాను ఈ శిక్ష పడినట్లు తెలుస్తోంది. నైట్ షిఫ్ట్స్ చేసే సమయంలో హెదర్ షుగర్ వ్యాధి లేనివారికి లెథల్ ఇన్సులిన్ ఇచ్చి వారిని చంపేసినట్లు తెలుస్తోంది.
నైట్ షిఫ్ట్ సమయంలో తక్కువ మంది స్టాఫ్ ఉండటంతో హెదర్ ఇన్సులిన ఇచ్చిన వారికి ఎమర్జెన్సీ వైద్యం అన్నదాతల్లో ఆలస్యమయ్యి చాలా మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హెదర్ అనుచిత ప్రవర్తన కారణంగా ఆమె పని చేసిన చాలా హాస్పిటల్లలో నుండి టర్మినేట్ చేయటం కానీ, ఆమె రాజీనామా చేయటం కానీ జరిగిందని, హెదర్ పేషేంట్స్ పట్ల మాత్రమే కాకుండా తన సహా ఉద్యోగుల పట్ల కూడా అనుచితంగా బిహేవ్ చేసేదని తెలుస్తోంది.