
Multibagger: స్టాక్ మార్కెట్లలో చిన్న పెట్టుబడిదారులు నిరంతరం వెతికేది తక్కువ ధరలో లభించే మంచి పెన్నీ స్టాక్స్ కోసమే. తక్కువ రేటుకు చాలా స్టాక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కొంత రీసెర్చ్ కోసం సమయం కేటాయిస్తే వాటిలో నుంచి సరైన, భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న మంచి పెన్నీ స్టాక్స్ ఎంపిక చేసుకోవచ్చు. ఇలా ఎంచుకున్న షేర్లు ఉత్తమ పనితీరుతో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తుంటాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిడెట్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి ఇదొక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఈ సంస్థ రుణాలు అందించటం, సెక్యూరిటీస్, అడ్వైజరీ వంటి వివిధ సేవలను అందించే వ్యాపారంలో ఉంది. ఈ పెన్నీ స్టాక్ ఇన్వెస్టర్లకు గడచిన మూడేళ్ల కాలంలో 562 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. అలాగే ఐదేళ్ల కాలంలో ఏకంగా 1225 శాతం రాబడిని అందించి సంపన్నులుగా మార్చేసింది. ఈ క్రమంలో కంపెనీ ఒకసారి తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను కూడా అందించిన సంగతి తెలిసిందే.
Also Read :- US మాంద్యంలోకి జారుకుంటే లాభపడేది ఇండియానే..!
ప్రస్తుతం కంపెనీ ప్రధానంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించటానికి ఒక కారణం ఉంది. అదేందంటే సొంతంగా ఒక అసెట్ రీకన్ష్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటమే. దీని ద్వారా మార్కెట్లోని నిరర్థక రుణాలు, కష్టాల్లో ఉన్న ఆస్తులను మేనేజ్ చేయాలని చూస్తోంది. ఈ కొత్త వ్యాపారం కోసం కంపెనీ దాదాపు రూ.3వందల కోట్లను వెచ్చించాలని చూస్తోంది. తన నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మధ్యస్థం నుండి దీర్ఘకాలికంగా 15-20 శాతం పెట్టుబడిపై రాబడిని ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం కంపెనీ తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా విస్తరించింది. ఈ క్రమంలో హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న యూఎస్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ సంస్థలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సేవల్లో కంపెనీ విస్తరణకు దోహదపడనుంది. ప్రస్తుతం కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఈవీ బూమ్ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఈవీ ఫైనాన్సింగ్ తన వృద్ధికి సహాయపడుతుందని భావిస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.