హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అందించే హైదరాబాద్ కంపెనీ బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ బోర్డు 2:1 స్టాక్ స్ప్లిట్‌కు ఆమోదం తెలిపింది. ఈ స్ప్లిట్‌లో ప్రతి ఈక్విటీ షేర్ (ప్రస్తుత ముఖ విలువ రూ. 2) రెండు కొత్త ఈక్విటీ షేర్లుగా (ముఖ విలువ రూపాయి) గా మారనుంది.
దీనికి నియంత్రణ, పరిపాలన అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. తాజాగా కంపెనీ నాలుగు ఏఐ ఆధారిత ఉత్పత్తులను లాంచ్ చేసింది.