మే నెల ఒకటో తేదీ రావటంతో ఏపీలో పెన్షన్ పంపిణీ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈసీ ఆదేశాలతో ఈ నెల పెన్షన్ డబ్బును అవ్వ, తాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. బ్యాంకు ఖాతా లేనివారికి, దివ్యాంగులకు ఈ నెల 5వ తేదీ లోగా సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ప్రభుత్వ నిర్ణయంతో అవ్వ, తాతలకు సచివాలయాల వద్ద పడిగాపులు కాసే సమస్య తీరిందని అనుకుంటే, కొత్త సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
గత 58నెలలుగా ఇంటివద్దనే పెన్షన్ అందుకున్న అవ్వ,తాతలు చాలా మంది బ్యాంకుల వైపు వెళ్ళటం మానేశారు. ఇప్పుడు వారి ఖాతాల్లో పెన్షన్ పడితే, అది తీసుకోవటం కోసం బ్యాంకు వెళ్లక తప్పని పరిస్థితి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది.
చాలా రోజులుగా లావాదేవీల్లేని బ్యాంకు ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ చార్జెస్, అకౌంట్ ఫ్రీజ్ అయ్యుండటం, వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడువేల పెన్షన్ సొమ్ములో కోత పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన కుట్ర వల్లే తమకు ఈ ఇబ్బందులు తలెత్తాయని, టంచనుగా ఒకటో తేదీన ఇంటివద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్లను అడ్డుకొని బాబు తమకు అన్యాయం చేశారని అభిప్రాయపడుతున్నారు అవ్వ, తాతలు.