ఫొటో మార్చి పెన్షన్ డబ్బులు స్వాహా.. బ్యాంక్​ ముందు వృద్ధురాలి నిరసన

ఫొటో మార్చి పెన్షన్ డబ్బులు స్వాహా.. బ్యాంక్​ ముందు వృద్ధురాలి నిరసన

వెల్దుర్తి, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు పెన్షన్  బుక్  మీద ఫొటో మార్చి ఓ వృద్ధురాలి పెన్షన్  డబ్బులు కాజేశారు. బాధితురాలి కథనం మేరకు.. మెదక్​ జిల్లా మాసాయిపేటకు చెందిన శేషు పెంటమ్మ అనారోగ్యంతో కొన్ని నెలలుగా  సికింద్రాబాద్  గాంధీ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్  తీసుకుంటోంది.

ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు పెన్షన్  బుక్కుపై ఫొటో మార్చి ప్రతి నెలా బ్యాంక్  నుంచి పెన్షన్  డబ్బులు తీసుకెళ్లారు. ఈ నెల పెన్షన్  కోసం ఆమె బుధవారం బ్యాంక్ కు రాగా, ఈ విషయం బయటపడింది. దీంతో ఆమె బ్యాంకు ముందు బైఠాయించి  నిరసన తెలిపింది.

బ్యాంక్  అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు అన్యాయం జరిగిందని ఆమె వాపోయింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్  చేసింది. ఈ విషయమై బ్యాంక్​ మేనేజర్  నవీన్ రెడ్డిని సంప్రదించగా, బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.