
భద్రాచలం, వెలుగు: ఐఆర్‌ను15 శాతానికి పెంచాలని గురువారం భద్రాచలంలో పెన్షనర్లు బైక్‌ర్యాలీ నిర్వహించారు. అలాగే ప్రతి నెల ఒకటో తేదీకే పెన్షన్లు ఇవ్వాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక పెన్షనర్ల ఆఫీస్నుంచి తాత గుడి సెంటర్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. ఆర్డీఓ మంగీలాల్‌కు వినతిపత్రం ఇచ్చారు.
అసోసియేషన్అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎల్.వి.ప్రసాద్, ప్రతినిధులు సత్యనారాయణ, నారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.