ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్,  వెలుగు: ఈ కుబేర్‌‌‌‌‌‌‌‌లో పెండింగ్‌‌‌‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం జిల్లా ప్రెసిడెంట్ ఎస్.దత్తాత్రేయరావు డిమాండ్‌‌‌‌ చేశారు. పెన్షనర్ల డిమాండ్స్ డే సందర్భంగా నిజామాబాద్ కలెక్టరేట్ ముందు గురువారం ధర్నా నిర్వహించి అడ్మినిస్ట్రేటివ్ అధికారి మెమోరాండం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్‌‌‌‌లో ఉన్న పెన్షనర్ల బకాయిలను ఏక మొత్తంలో చెల్లించాలని , ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులతో సహా అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌‌‌‌రావు, ఉపాధ్యక్షులు ముత్తారం నరసింహస్వామి, ప్రసాద్‌‌‌‌రావు, శిర్ప హనుమాన్లు, అందే సాయిలు, కృష్ణారావు, మదన్‌‌‌‌మోహన్, సాయన్న,శంకర్, రాధాకిషన్, భోజరావు, రాజేశ్వర్, పుండరీ, లక్ష్మీనారాయణ, జస్వీర్ సింగ్, గంగారాం పాల్గొన్నారు. 

  • యాసంగి యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రెడీ
  • ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో సాగు
  • ఈసారి వరే అధికం..

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో యాసంగి సాగుకు రైతులు రెడీ అవుతున్నారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు  అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ పక్కా ప్లాన్‌‌‌‌తో ముందుకు సాగుతోంది. ఈ సీజన్‌‌‌‌లో ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ఏడు లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 4,96,279 ఎకరాల పంటలు సాగు కానున్నట్లు చెబుతున్నారు. ఇందులో వరి 3.67 లక్షల ఎకరాలు, 40,038 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న 19,745, సన్‌‌‌‌ఫ్లవర్ 15,089 ఎకరాలు, మిగతా పంటలు 54 వేల వరకు సాగు కానున్నాయని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి.  

ఎరువులు షార్టేజే..

జిల్లాలో యాసంగి సీజన్‌‌‌‌లో ఎరువులు, విత్తనాల కోసం వ్యవసాయ శాఖ పక్కా ప్రణాళికలు రూపొందించింది. కానీ ఎరువుల కొరత మాత్రం స్పష్టంగా  కనిపిస్తోంది. యూరియా కోటా వస్తేగానే ఈ సీజన్‌‌‌‌లో రైతులకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. జిల్లాకు 96,651 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. ప్రస్తుతం 25 వేల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. డీఏపీ 26,167  మెట్రిక్ టన్నులు అవసరం కాగా 3 వేల టన్నుల నిల్వ ఉంది. కాంప్లెక్స్ ఎరువు 37,427 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 15 వేల మెట్రిక్ టన్నులు ఉంది.  

విప్ గోవర్ధన్‌‌‌‌కు మాతృ వియోగం

కామారెడ్డి/భిక్కనూరు, వెలుగు: కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తల్లి గంప రాజమ్మ( 97) గురువారం సాయంత్రం చనిపోయారు. గత కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె హైదరాబాద్‌‌‌‌లోని బంజరాహిల్స్‌‌‌‌లో మంత్రుల క్వార్టర్స్‌‌‌‌లో ఉండే గోవర్ధన్​ఇంట్లో కన్నుమూశారు. రాజమ్మకు ఇద్దరు కొడుకులు గంప గోపాల్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌‌‌‌తో పాటు ఐదుగురు కూతుళ్లు. రాత్రికి ఆమె పార్థివదేహాన్ని వీరి సొంతూరు భిక్కనూరు మండలం బస్వాపూర్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చారు. శుక్రవారం అంత్యక్రియలు జరుగనున్నాయి. రాజమ్మ మృతి పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం వ్యక్తం చేసి గోవర్ధన్‌‌‌‌ను ఫోన్‌‌‌‌లో పరామర్శించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి, ఆర్అండ్‌‌‌‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎం.కె ముజీబుద్దీన్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు సంతాపం ప్రకటించారు.

డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉంటే సహించం

నిజామాబాద్,  వెలుగు: గర్భిణుల వివరాలను ఆన్ లైన్‌‌‌‌లో నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారులు, సిబ్బందిపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై గురువారం ఆయన వైద్యాధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. గర్భిణుల రిజిస్ట్రేషన్ జిల్లాలో సగటున 91 శాతం జరిగినప్పటికీ, మెండోరా, చౌటుపల్లి, వేల్పూర్ పీహెచ్‌‌‌‌సీల పరిధిలో 40 శాతం మాత్రమే ఉండడంపై కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. మెండోరా పీహెచ్‌‌‌‌సీ సూపర్‌‌‌‌‌‌‌‌ వైజర్‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్ చేయడంతో పాటు వైద్యాధికారికి సంజాయిషీ నోటీస్‌‌‌‌ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్సత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో వెనుకబడిన పోచంపాడ్, కిసాన్ నగర్, నందిపేట, పోచంపల్లి, వినాయక నగర్, చంద్రశేఖర్ కాలనీ, కమ్మర్‌‌‌‌‌‌‌‌పల్లి తదితర పీహెచ్‌‌‌‌సీల డాక్టర్ల కూడా మెమోలు జారీ చేయాలని డీఎంహెచ్‌‌‌‌వో డాక్టర్ సుదర్శన్ ఆదేశించారు. నిజామాబాద్ జీజీహెచ్, ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులను కాన్పు కోసం తీసుకెళ్తే తమ పట్ల కొందరు సిబ్బంది అనుచితంగా వ్యవహరించారని ఆశా వర్కర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. బాధ్యులైన సిబ్బందిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో పీవో అంజన, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వో తుకారాం రాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. 

అంబేద్కర్ విగ్రహం ఎదుట బీజేపీ నిరసన

కామారెడ్డి/లింగంపేట, వెలుగు: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్‌‌‌‌ అరెస్టును నిరసిస్తూ గురువారం కామారెడ్డి, లింగంపేటలో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉన్న అంబేడ్కర్ ​విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన నిర్వహించారు. మునుగోడులో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తేలు శ్రీనివాస్, టౌన్​ ప్రెసిడెంట్ విపుల్ జైన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. లింగంపేటలో జరిగిన ఆందోళనలో ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి,  ప్రధాన కార్యదర్శి వడ్ల రాంచందర్, ఉపాధ్యక్షుడు రాజారాం సాయిలు, మోతీరాం పాల్గోన్నారు.

ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో మెగా హెల్త్​ క్యాంప్

ఆర్మూర్, వెలుగు: పట్టణంలోని 13వ వార్డు పరిధి పోచమ్మ గల్లీలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మధుశేఖర్ పుట్టిన రోజు గురువారం మల్టీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ మధుశేఖర్‌‌‌‌‌‌‌‌తో పాటు డాక్టర్లు​ నాగరాజు, నరేశ్‌‌‌‌, అమృత్ రాంరెడ్డి, రాజు, అజయ్, వంశీ, హవాజీరావు హాజరై వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. చేయూత సంస్థ ప్రతినిధులు తులసీదాస్ క్రాంతి, కలిగోట గంగాధర్, జనార్దన్‌‌‌‌గౌడ్, కొక్కుల సాగర్, ధర్మపురి, పోల సుధాకర్, ప్రసాద్, సొసైటీ వైస్ చైర్మన్ నర్మె నవీన్, కౌన్సిలర్ రింగుల భారతి భూషణ్, హనుమాన్‌‌‌‌ యూత్, కాత్యాయని యూత్ సభ్యులు పాల్గొన్నారు. 

తరుగు తగ్గించాలని రైతుల ధర్నా

లింగంపేట, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో తరుగు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ముందు రైతులు ధర్నాకు దిగారు. మండలంలోని మాల్తుమ్మెద, తాండూర్ సింగిల్​విండోల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్లలో 40 కిలోల బస్తాకు కిలోనర నుంచి రెండు కిలోల చొప్పు క్వింటాల్‌‌‌‌కు 5 కిలోల వరకు తరుగు పేరిట తీస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఆఫీసర్లు స్పందించాలన్నారు. కాగా ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించారు. మండలంలోని ఆత్మకూర్, చీనూర్, వాడి, గోపాల్‌‌‌‌పేట, ధర్మారెడ్డి, రాఘవపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు.

కేదారీశ్వర ఆశ్రమంలో భక్తుల సందడి

నందిపేట, వెలుగు: కార్తీక దశమి గురువారాన్ని పురస్కరించుకుని మండలంలోని కేదారీశ్వర ఆశ్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగిరాములు మహారాజ్​గత 30 రోజులుగా అనుష్టాన దీక్షలో ఉంటూ రోజూ ఉదయం భక్తులకు దర్శనమిస్తున్నారు. మరో ఐదు రోజుల పాటు దీక్ష కొనసాగించి 11న కార్తీక పౌర్ణమి రోజున విరమిస్తారు.12న ఆశ్రమం వద్ద జాతర నిర్వహిస్తారు. 

వడ్ల కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌ షురూ

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మార్కెట్ అవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌ను చైర్మన్ చిట్టెడి భగవంతరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండించిన వడ్లకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందన్నారు. రైతులు కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గాల్‌‌‌‌రెడ్డి, వైస్​చైర్మన్ హన్మంతరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు కిష్టాగౌడ్, గోండ్ల సిద్దరాములు, విండో చైర్మన్లు నాగర్తి భూమిరెడ్డి, బాలగౌని రాజగౌడ్,సెక్రటరీ థామస్‌‌‌‌, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది, హామాలీలు పాల్గొన్నారు.