
ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ చేసే పింఛన్లను ఏప్రిల్లో మూడో తేదీన లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తేదీ ఆర్బీఐకి సెలవు, రెండో తేదీ ఆదివారం అయినందున మూడో తేదీన పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక కోసం ఏపీ ప్రభుత్వం రూ.21,434 కోట్లు కేటాయించింది.