
- శంకరపట్నం మండలంలో వరుస చోరీలతో బేంబేలు
శంకరపట్నం, వెలుగు: శంకరపట్నం మండలంలో వరుస చోరీలతో జనం బేంబేలెత్తుతున్నారు. రెండున్నర నెలల్లో సుమారు 15 చోరీలు జరిగాయి. మండలవ్యాప్తంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చాలావరకు పనిచేయకపోవడంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది.
- జనవరి 11న మొలంగూరు గ్రామంలో ఇంటికి తాళం వేసి కూతురుని తీసుకువచ్చేందుకు ఓ మహిళ ఇంటికి తాళం వేసి వెళ్లింది. తాళం పగలగొట్టి ఇంట్లో దాచిపెట్టిన రూ.50వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మరవకు ముందే జనవరి 13న కేశవపట్నం రైతు వేదికలో అంప్లిఫయర్, సౌండ్ బాక్సులు ఎత్తుకెళ్లారు.
- జనవరి 26న కిరాణ దుకాణానికి తాళం వేసి హనుమకొండ వెళ్లగా.. అర్ధరాత్రి షట్టర్పగలగొట్టి రూ.5 లక్షలు విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు.
- ఫిబ్రవరి 8న మొలంగూరులో కరెంట్ మోటర్చోరీ చేశారు.
- మార్చి 4న పోచమ్మ ఎల్లమ్మ దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లారు. ఈనెల 13న వంకాయగూడెంలోని కిరాణా దుకాణంలో తాళాలు పగలగొట్టి రూ.12 వేల నగదును ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు మొలంగూర్, ఇప్పలపల్లి గ్రామాల్లో 3 వ్యవసాయ మోటార్లు చోరీకి గురయ్యాయి.
- ఇటీవల కన్నాపూర్ గ్రామంలో చికెన్ సెంటర్ తాళాలు పగలగొట్టి 40 కోళ్లు ఎత్తుకెళ్లారు.
- కన్నాపూర్ గ్రామానికి చెందిన ఆరు కుటుంబాల వారు ఆదివారం కొమురవెల్లి, ఐలోని మల్లన్న దర్శనానికి వెళ్లగా.. తాళం వేసి ఆ ఆరిండ్లలో తాళాలు పగలగొట్టి 12 తులాల బంగారం, 30 తులాల వెండి, మరికొంత నగదు ఎత్తుకెళ్లారు.