
హైదరాబాద్: హోలీ ముసుగులో గంజాయి వినియోగిస్తున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారుచేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్తో పాటు గంజాయి బాల్స్ను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హోలీ అంటేనే రంగుల పండుగ. ఒళ్లంతా రంగులు చల్లుకొని హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఇలా హోలీ రంగుల్లో ఆటపాటలతో నగర ప్రజలు ఎంజాయ్ చేస్తుంటే లోయర్ ధూల్పేట్లోని మల్చిపురాలో కుల్ఫీ ఐస్ క్రీమ్లో గంజాయి, బర్ఫీ స్వీటులో గంజాయి, సిల్వర్ కోటెడ్ బాల్స్లో గంజాయి వినియోగిస్తూ ధూల్పేట్లో సంబరాలు జరుపుకుంటున్నట్లు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులకు సమాచారం అందింది.
Also Read:-యూట్యూబ్ లో చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్న..
ఎస్టీఎఫ్ ఏ టీం అంజిరెడ్డి గ్రూపులోని ఎక్సైజ్ పోలీసులు గంజాయి ముసుగులో జరుగుతున్న హోలీ వేడుకలపై దాడులు చేశారు. గంజాయితో తయారు చేసి వినియోగిస్తున్న కుల్ఫీ ఐస్ క్రీమ్ను, బర్ఫీ స్వీటును, సిల్వర్ కోటెడ్ బాల్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ఎన్ ఫోర్స్ మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకొని అమ్ముతున్న సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి చెప్పారు.