బీరప్ప నగర్ల లో.. కంకరపోశారు.. వదిలేశారు..

తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప నగర్ నలంద స్కూల్ వెనక బజారులో సీసీ రోడ్డు, డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది రోడ్డు, సైడ్ డ్రైనేజీ నిర్మిస్తామని కంకర పోసి వదిలేశారు.

దీంతో కాలనీవాసులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.