![ఢిల్లీలో జనం విసిగిపోయారు: ప్రియాంక](https://static.v6velugu.com/uploads/2025/02/people-are-fed-up-in-delhi-says-priyanka-gandhi_bjWAzGUTrw.jpg)
ఢిల్లీ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను చూసి విసిగిపోయి.. మార్పు కోసం ఓటు వేశారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశాల్లోనే ఈ విషయం స్పష్టంగా తెలిసింది. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకున్నారు.
పోలింగ్ రోజు దీనిని దృష్టిలో పెట్టుకుని ఓటేసినట్లున్నారు. గెలిచిన అభ్యర్థులందరికీ నా అభినందనలు. ఈ ఫలితాలు మేం మరింత కష్టపడి పనిచేయాలని చెబుతున్నాయి. పార్టీ నాయకులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండాలి. ప్రజల సమస్యలపై వేగంగా స్పందించాలి.