మెంటల్ హెల్త్ ఇష్యూలకు ట్రీట్మెంట్గా రకరకాల థెరపీలు ఉంటాయి. అందులో భాగంగా ఎకో థెరపీని ఫాలో అవుతున్నారు చాలామంది. ఎకో థెరపీ అనేది ప్రకృతి చికిత్స. దీన్ని ఫారెస్ట్ థెరపీ, ఫారెస్ట్ బాత్, గ్రౌండింగ్, ఎర్తింగ్, షిన్రిన్–యోకు లేదా సామి లోక్ అనే పేర్లతో పిలుస్తారు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఈ థెరపీలో చేయాల్సిందల్లా... ప్రకృతిని గమనిస్తూ మెల్లగా శ్వాస పీలుస్తూ వాటి మధ్యలో మౌనంగా కూర్చోవాలి.
క్యూ గార్డెన్స్‌కు చెందిన నేచర్, ఫారెస్ట్ బాతింగ్ హోస్ట్ సుసన్నే మెయిస్ ఈ థెరపీ గురించి చెప్తూ.. ‘‘మొదట ఇక్కడకు రండి. చూడండి. వినండి. వాసన చూడండి. స్పర్శని ఫీల్ అవ్వండి అలా ఎవరికి వాళ్లు ఫారెస్ట్ బాతింగ్ని ఎక్స్‌పీరియెన్స్ చేయండి” అన్నారు. ‘‘కొవిడ్ టైంలో, ఆ తర్వాత కూడా కొన్ని వేల మంది ఫారెస్ట్ బాతింగ్ ద్వారా మేలు పొందారు. కొంతమంది ఫారెస్ట్ బాతింగ్ వల్ల జీవితాలను కాపాడుకోగలిగారు.
ప్రకృతితో ఏర్పరచుకునే బంధం ఇచ్చే ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేం. చాలా బాగుంటుంది. ఈ థెరపీ తర్వాత ఇంతకు ముందు లేని కొత్త జీవితాన్ని గడుపుతున్నామని ఎంతోమంది చెప్తున్నారు’’ అన్నారామె. ఇంగ్లండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) అనేది ఇంగ్లాండ్‌లో పబ్లిక్‌గా నిధులు సమకూర్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ. 2022– 2023 మధ్య ఇంగ్లండ్‌లోని 50 లక్షల మంది పేషెంట్లు మెంటల్ హెల్త్ కేర్ తీసుకున్నారు. ఆధునిక జీవన విధానంలో ఒత్తిడిని జయించేందుకు ఐదేండ్లలో పది లక్షలకు మందికి పైగా పేషెంట్లు పెరిగారు.
పడకలేని ఇంటికి అద్దె నాలుగు లక్షలు
సిటీలో బతకాలంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంపాదన బాగా ఉండాలి. జీతంలో ఎక్కువ మొత్తం ఫ్లాట్ అద్దెకే పోతుంది. ఒకవేళ ఫ్లాట్ కాస్త విశాలంగా ఉండి, మెయింటెనెన్స్ బాగుంటే ఇంకాస్త ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక్క ఇంటికే... అది కూడా బెడ్ రూమ్ లేని ఇంటికి లక్షల్లో అద్దె కట్టాల్సి వస్తుందట అక్కడ.
న్యూయార్క్ సిటీలోని మన్హట్టన్లో అపార్ట్మెంట్ రెంట్‌కు చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒమర్ లాబాక్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మన్‌హట్టన్‌లోని ఒక చిన్న అపార్ట్మెంట్ వీడియో పోస్ట్ చేశాడు. ఈ ప్రత్యేకమైన అపార్ట్మెంట్లో లివింగ్ స్పేస్, కిచెన్ రూమ్, బాత్రూమ్లు ఉన్నాయి. మరికొంత ఖాళీ ప్లేస్ కూడా ఉంది. దాన్ని ఆఫీస్ వర్క్ కోసం వాడుకోవచ్చు. ఇవన్నీ ‘ఓకే’ మరి పడుకునేందుకు బెడ్ రూమ్ ఎక్కడుంది? అంటున్నారా. అదే లేదు. కానీ, దీనికి అద్దె మాత్రం నెలకు 4,965 డాలర్లు. అంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలన్నమాట! దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
పే....ద్ద చేప
అప్పుడప్పుడు సముద్రంలోని పెద్ద చేపలు వలలకు చిక్కుతుంటాయి. అవి దాదాపు ఐదు కేజీల వరకు బరువుతో, పెద్దగా ఉంటాయి. అలాంటి చేప ఒకటి యునైటెడ్ స్టేట్స్‌లోని ఒరెగాన్ ఉత్తర సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. పెద్దగా ఉన్న ఆ చేప దాదాపు7.3 అడుగుల పొడవు ఉంది. దాని పేరు హుడ్ వింకర్ సన్‌ఫిష్. గేర్హార్ట్లోని బీచ్‌లో మొదటిసారి కనిపించిన ఈ బిగ్ ఫిష్ ఐదు రోజుల పాటు అక్కడే ఉందట!