- టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు
- ఇటు రాష్ట్రంలోని జిల్లాలు, అటు ఏపీకి ఓటర్ల పయనం
- 2 వేల స్పెషల్ బస్సులు వేసిన టీఎస్ఆర్టీసీ
- 400కు పైగా ఏపీ బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్
- ఐదారు స్పెషల్ ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ
హైదరాబాద్/యాదాద్రి/కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : తెలుగు రాష్ట్రాల్లో పండుగలను మించిన వాతావరణం నెలకొంది. ఓటేసేందుకు జనం హైదరాబాద్ నుంచి సొంతూర్ల బాట పట్టారు. ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు పయనమయ్యారు. ఊర్లకు వెళ్తున్న వారితో హైవేలు కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు నిండిపోయి వెళ్తున్నాయి. కార్లు బారులు తీరుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, ఈసారి ఎన్నికలను జనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్ల బాట పట్టారు.
ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు పయనమయ్యారు. ఊళ్లకు వెళ్తున్న వారితో హైవేలు కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు నిండిపోయి వెళ్తున్నాయి. కార్లు బారులు తీరుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, ఈసారి ఎన్నికలను జనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్ల బాట పట్టారు. హైదరాబాద్‌సిటీ నుంచి దాదాపు 22 లక్షల మంది దాకా ఊళ్లకు వెళ్లారని తెలుస్తున్నది. వీరిలో 15 నుంచి 16 లక్షల మంది దాకా ఏపీ ఓటర్లే ఉంటారని అంచనా.
వాస్తవానికి చాలా మంది ఏపీ ఓటర్లకు తెలంగాణలోనూ ఓటు హక్కుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఓటేసిన ఏపీ వాసులు.. ఇప్పుడు తమ సొంత రాష్ట్రంలో ఓటు వేసేందుకు బారులు తీరి వెళ్తున్నారు. రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ 2 వేల స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు వైజాగ్, కాకినాడ, విజయవాడకు ఐదారు స్పెషల్ట్రైన్లను రైల్వే శాఖ నడుపుతున్నది. శుక్రవారం ఉదయానికి ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 400కు పైగా బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్‌అయ్యాయి. శనివారం ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు ఎల్బీనగర్, హయత్‌నగర్, బాలానగర్, లక్డీకాపూల్ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. కొన్నిచోట్ల బస్సులు దొరక్క ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు.
మన వాళ్లు సైతం..
రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలులో ఉండడంతో వాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పల్లెలకు బయల్దేరి వెళ్లారు. ఈ పథకం ద్వారా ఓటింగ్‌శాతం పెరిగేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు కొందరు ప్రత్యేక వాహనాలను పెట్టి ఓటర్లను సొంతూర్లకు తీసుకెళ్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్బస్సులూ ఏపీకి నడుపుతున్న సర్వీసులను పెంచినట్టు తెలుస్తున్నది.
ప్రైవేట్ వెహికల్స్లోనూ ఏపీ వాసులు బయల్దేరి వెళ్లడంతోఓఆర్ఆర్ల వద్ద కూడా వాహనాల రద్దీ ఎక్కువైంది. కాగా, ఏపీ ఓటర్లు వెళ్లిపోవడంతో సిటీలోని మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పోలింగ్ పై ప్రభావం పడుతుందని నేతలు అంచనా వేస్తున్నారు.
టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్..
కొందరు ఏపీ ఓటర్లు ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్లారు. మరికొందరు సొంతకార్లలో బయల్దేరి వెళ్లారు. దీంతో అటు బస్సులు, ఇటు కార్లతో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి టోల్‌ప్లాజా, కొర్లపహాడ్టోల్గేట్ దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. యాదాద్రి జిల్లా మీదుగా సాగే హైదరాబాద్–వరంగల్జాతీయ రహదారిపై రద్దీ మామూలుగానే ఉన్నా.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం వాహనాలు పెద్ద సంఖ్యలో ప్రయాణించాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 36,156 వెహికల్స్రాకపోకలు సాగించాయి.
వీటిలో ఎక్కువగా విజయవాడ వైపునకు ప్రయాణించాయి. పంతంగి టోల్ ప్లాజావద్ద 16 గేట్లు ఉండగా, విజయవాడ వైపునకు 10 గేట్లు తెరిచి, హైదరాబాద్ వైపునకు 6 గేట్లు తెరిచి ఉంచారు. ఇక నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి. ఇక్కడ ఫాస్టాగ్ స్కానింగ్ లేట్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.