
- కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఆవిర్భావ మీ టింగ్‌లో మాజీ సీఎం కేసీఆర్ స్పీచ్‌ను చూసి జనాలు నవ్వుకున్నారని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. ఆయన మతిభ్రమించి మాట్లాడారని, స్పీచ్ అంతా రాష్ట్ర సర్కార్ మీద విషం చిమ్మేలా ఉందని మండిపడ్డారు. సోమ వారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో 25 లక్షల ఎకరాల భూములను పేదలకు పం చామని
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి మూడేండ్లలో కూలే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఎద్దేవా చేశారు. తండ్రి పేరు చెప్పుకొని కేటీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం జడ్పీటీసీ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చి సీఎంగా ఎదిగారన్నారు.