క్యాస్ట్‌‌, ఇన్‌‌కం సర్టిఫికేట్ల కోసం అవస్థలు

కరీంనగర్ టౌన్, వెలుగు: బీసీలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కోసం అప్లై చేసుకునేందుకు ఇన్ కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. 20తో అప్లై గడువు ముగియనుండడంతో జనం తహసీల్​ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలో తహసీల్​ఆఫీసులకు జనం క్యూకడుతున్నారు. సోమవారం అర్బన్ తహసీల్​ ​ఆఫీసు మూసి వేసి కిటికీల వద్ద నుంచి సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పడంతో జనం అక్కడే వేచి ఉన్నారు.