మంచు తుఫాన్​లో చిక్కుకుని.. కారులోనే ఆగిన ఊపిరి

మంచు తుఫాన్​లో చిక్కుకుని.. కారులోనే ఆగిన ఊపిరి
  •     18 గంటలు కారులోనే గడిపిన అమెరికా మహిళ
  •     రెస్క్యూ టీమ్​ వెళ్లేసరికే మృతి.. న్యూయార్క్ స్టేట్​లో ఘటన

న్యూయార్క్: అమెరికాలో భీకరమైన మంచు తుఫాను కారణంగా ప్రజలు చనిపోతూనే ఉన్నారు. న్యూయార్క్  స్టేట్​లోని చార్లెట్  సిటీలో ఆండెల్  టేలర్(22) అనే మహిళ కారులో 18 గంటలపాటు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం డ్యూటీకి పోయిన టేలర్  సాయంత్రం కారులో ఇంటికి బయల్దేరింది. మంచు తుఫాను వల్ల ఆమె కారు మధ్యలోనే చిక్కుకుపోయింది. బయట భీకరమైన చలిగాలులు వీస్తున్నాయంటూ సెల్​ఫోన్​ తో వీడియో తీసి ఆమె తన కుటుంబ సభ్యులకు పంపించింది.

టేలర్​ను కాపాడాలని ఆమె ఫ్యామిలీ మెంబర్లు రెస్క్యూ, ఎమర్జెన్సీ టీంలకు విజ్ఞప్తి చేశారు. ఆమెను రక్షించేందుకు శనివారం వెళ్లిన రెస్క్యూ టీం సభ్యులకు కారులో టేలర్ శవమై కనిపించింది. ఆమె 18 గంటలపాటు కారులోనే చిక్కుకుపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే టేలర్​ మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని అధికారులు చెప్పారు.