గండీడ్, వెలుగు : మహమ్మదాబాద్ మండలంలో అనుబంధ గ్రామాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శేఖపల్లి గ్రామపంచాయతీ అనుబంధగ్రామమైన దాడితండాలో తాగునీరుకోసం గిరిజనులు అవస్తులు పడుతున్నారు. మిషన్ భగీరథనీటి ట్యాంకు ఉన్నా రెండు నెలలుగా నీరు సరిగ్గా రావడంలేదని తండావాసులు ఆవేదన వ్యక్తంచేశారు.
సింగిల్ ఫేస్ బోర్ మోటార్, సోలార్ బోర్ మోటార్ ఉన్నా అవి పనిచేయడంలేదు. దీంతో తండా సమీపంలోని వ్యవసాయ బావి నుంచి రోజూ నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి మోటార్లు బాగు చేయించాలని వారు కోరతున్నారు.