
- జిల్లాలో బీపీ పేషెంట్లు 1,00, 657, షుగర్ 62,696 మందికి..
- రూరల్ ఏరియాల్లోనూ పెరుగుతున్న లైఫ్‌స్టైల్ జబ్బులు
కామారెడ్డి, వెలుగు : మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల మార్పులతో 30 ఏండ్లు దాటగానే బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలో ఇటీవల 4,99,771 మందికి స్క్రీన్ చేస్తే 1,00,657 మందికి బీపీ, 62,696 మందికి షుగర్ ఉన్నట్లు తేలింది. బీపీ, షుగర్ వ్యాధులు గతంలో టౌన్ ఏరియాల్లో ఎక్కువగా ఉండగా ఇప్పుడు రూరల్ ఏరియాల్లోనూ ఎక్కువవుతున్నాయి. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో 30 ఏండ్లు దాటిన వారికి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పై ( ఎన్సీడీ) హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహిస్తోంది.
ఏటా బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. టౌన్ ఏరియాలోని హెల్త్ సెంటర్లలోనే కాకుండా రూరల్ ఏరియాలోని హెల్త్ సెంటర్లలో కూడా వందలాది మందికి బీపీ, షుగర్ఉన్నట్లు తేలుతోంది. ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇంటికి వెళ్లి టెస్టులు చేయటం, హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు బీపీ, షుగర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడుతున్న వారికి కావాల్సిన మందులను ప్రతి నెలా పీహెచ్‌సీల ద్వారా అందిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం 30 ఏండ్లు దాటిన ఆయా పీహెచ్‌సీల పరిధిలో 5,56,678 మంది ఉంటే... ఇందులో ఇప్పటి వరకు 4,99,771 మందికి టెస్టులు చేశారు. ఈ నెలాఖరు వరకు స్ర్కీనింగ్ పక్రియ కంప్లీట్ కానుంది. ఆయా పీహెచ్‌సీలకు నిర్ధేశించిన టార్గెట్ మేరకు టెస్టులు చేస్తున్నారు. ఈ టెస్టుల్లో బీపీ ( హైపర్ టెన్షన్ ) 1,00,657 మంది, షుగర్ 62, 696 మందికి ఉంది. కొందరికీ ఈ రెండు వ్యాధులు ఉన్నాయి. టెస్టు చేసిన ప్రతి 100 మందిలో బీపీ 20 మందికి, షుగర్ 12 మందికి ఉంది.
యుక్త వయస్సులోనే వ్యాధులు..
గతంలో బీపీ, షుగర్ వ్యాధులు 50 నుంచి 60 ఏండ్లు దాటితే వచ్చేవి. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులోనే బీపీ, షుగర్ వస్తుంది. 30 ఏండ్లు దాటితే వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవన శైలిలో వచ్చిన మార్పులు అని డాక్టర్లు చెబుతున్నారు. శరీరానికి తగిన శ్రమ లేకపోవటం, అధికంగా ఒత్తిడికి గురి అవుతుండటం, తీసుకునే ఆహారం, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి అలవాటు పడి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.
హెన్మాజీపేట పీహెచ్సీ పరిధిలో ఎక్కువ మందికి ..
హన్మాజీపేట పీహెచ్సీ పరిధిలో ఎక్కువ మందికి బీపీ, షుగర్ వ్యాధులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ పీహెచ్సీ పరిధిలో 20,065 మందికి స్ర్కీన్ చేస్తే వీరిలో 7,527 మందికి బీపీ ( 38 శాతం), షుగర్ 3,792 మందికి ( 19 శాతం ) ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత జుక్కల్ లో ఉంది. ఇక్కడ27,800 మందికి టెస్టు చేస్తే బీపీ 7,684 మందికి ( 28 శాతం), షుగర్ 4,490 మందికి ( 16 శాతం ) ఉంది.
పీహెచ్‌ల వారీగా వివరాలు ..
పీహెచ్సీ స్ర్కీనింగ్ బీపీ షుగర్
అన్నారం 10,346 1,574 1,225
భిక్కనూరు 20,306 3,726 2,090
బీబీపేట 31,267 4,675 3,564
దేవునిపల్లి 30,288 5,361 3,822
ఎర్రాపహాడ్ 23,563 4,927 2,885
మాచారెడ్డి 20,923 3,870 2,179
రాజంపేట 13,360 2,189 1,554
రాజీవ్‌నగర్ 12544 2,456 1,531
రామారెడ్డి 15,273 3,264 2,041
సదాశివనగర్ 15,410 3,113 1,677
ఇస్లాంపూరా 27,857 4,578 2,302
లింగంపేట 25,953 5,689 3,348
మత్తమాల్ 24,689 4,025 2,737
ఉత్తునూర్ 29,373 5,398 3,637
బీర్కుర్ 27,315 4,601 3,220
డొంగ్లి 30,063 5,910 3,979
హన్మాజీపేట 20,065 7,527 3,792
నిజాంసాగర్ 42,690 9,450 5,351
పెద్దకొడప్గల్ 33,996 7,289 4,712
జుక్కల్ 27,800 7,684 4,490