జానకంపేట్ లో వైరల్​ ఫీవర్స్

జానకంపేట్ లో వైరల్​ ఫీవర్స్
  • దాదాపు 30 మందికి జ్వరాలు
  • వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ
  • వైద్య పరీక్షలు చేసిమందుల పంపిణీ

ఎడపల్లి, వెలుగు:  ఎడపల్లి మండలంలోని  జానకంపేట్​ గ్రామంలో వైరల్​ ఫీవర్ తో ప్రజలు బాధ పడుతున్నారు.  20 రోజులుల్లో గ్రామంలో 30 మందికి పైగా వైరల్​ ఫీవర్ వచ్చింది.   ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలకు డెంగ్యూ  వచ్చింది.  జ్వరపీడితులు నిజామాబాద్​ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. గ్రామంలో ఓ పాడుబడ్డ బావిలో చెత్తాచెదారంతో వేసి పంచాయతీ సిబ్బంది బావిని పూడ్చుతున్నారు.

 దీంతో బావి మురికి గుంటగా  మారడటంతో దోమలు వృద్ధి చెందాయని, అప్పటి నుంచి దోమకాటుకు గురై చిన్నాపెద్ద వైరల్​ ఫీవర్​ బారిన పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.  బావిని పూడ్చాలని  పంచాయతీ సిబ్బందికి పలుమార్లు విన్నవించినా పట్టించు కోవడంలేదని మండిపడుతున్నారు.

  వైరల్​ ఫీవర్, డెంగ్యూ కేసుల గురించి తెలిసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.  శిబిరంలో జర్వపీడితులకు వైరల్​ ఫీవర్, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.  వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.  

అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో వైరల్​ ఫీవర్స్​ ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని పంంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.  గ్రామస్తులు కూడా ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనారోగ్యానికి గురైతే వెంటేప్రభుత్వఆసుపత్రిలోచికిత్సచేయించుకోవాలన్నారు.