నవీపేట్, వెలుగు : గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఇంటింటికీ చెత్త బుట్టలు పంచినా ఎవ్వరు వాటిని వాడడం లేదు. ఇష్టం వచ్చినట్లు చెత్తను రోడ్ల మీద వేస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించవలసిన చెత్తబండిగానీ, ట్రాక్టర్ గానీ రాకపోవడంతో గ్రామస్తులు చెత్తనంతా సుభాష్ నగర్ కెనాల్ పక్కనే వేస్తుండడంతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డులాగా తయారైంది. దీంతో దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయని వారు వాపోతున్నారు.