సాయం కోసం సోనూ తలుపు తట్టిన జనం

నటుడు సోనూసూద్ ఇంటికి నిత్యం వేల సంఖ్యలో జనం సాయం కోసం వస్తుంటారు. ఆపదలో ఉన్నాం..ఆదుకోవాలని కోరుతుంటారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో జనం సాయం కోసం సోనూసూద్  ఇంటి తలుపు తట్టారు. వారందరిని పలకరించిన సోనూసూద్..కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.కొందరు ఆపరేషన్లు, మరికొందరు ఇతర ఆరోగ్య సమస్యలను సోనూసూద్కు వివరించారు. వారందరికి సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొందరు అభిమానులు సోనూసూద్తో ఫోటోలు దిగారు. మరికొందరు ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు.