మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వభూమిలో గుడిసెలకు ప్రయత్నించారు పేదలు. దాదాపు 504 ఎకరాల్లో గుడిసెలు వేశారు. ఘటనాస్థలానికి పెద్దఎత్తున పోలీసులు చేరుకున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండీఏ అధికారులు. ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు ఖాళీచేయకపోతే పీడీయాక్ట్ కేసులు పెడతామన్నారు పోలీసులు. సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వభూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసులు. పేదలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు. దీంతో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
గతంలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియక 16మంది వ్యక్తులు కొన్నారని చెప్పారు పోలీసులు. ఈ భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్దారించి ఎచ్ఎండిఏ కు అప్పగించిందన్నారు. దీంతో ఈ భూమి కొన్నవారు సుప్రీం కోర్టును అశ్రాయించారు. కొంత మంది సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు అధికారులు.