
హైదరాబాద్సిటీ నెట్వర్క్ వెలుగు : జమ్మూ కశ్మీర్పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని గ్రేటర్ప్రజలు తీవ్రంగా ఖండించారు. బుధవారం సాయంత్రం సిటీలోని వేర్వేరుచోట్ల నిరసన ర్యాలీలు నిర్వహించారు. క్యాండిల్స్వెలిగించి ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళి అర్పించారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తీవ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాలని నినాదాలు చేశారు. టూరిస్టులపై ఉగ్రదాడి పిరికిపంద చర్య అని మండిపడ్డారు.
వికారాబాద్ఎన్టీఆర్ చౌరస్తాలో శాంతి ర్యాలీ తీశారు. పద్మారావునగర్ స్కందగిరి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వేదపండితులు మోక్ష దీపాలు వెలగించారు. మొజంజాహి మార్కెట్ చౌరస్తా వద్ద బీజేవైఎం నాయకులు ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు. వనస్థలిపురంలో బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్స్ర్యాలీ తీశారు.