కొత్తగూడెంలో జనం లేక వెలవెలబోయిన నడ్డా సభ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏప్రిల్ 29న జరిగిన బీజేపీ జన సభకు జనం కరువయ్యారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ తరుపున బహిరంగ సభలో పాల్గొన్నారు  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అయితే  నడ్డా సభ జనం లేక  వెలవెలబోయింది. వేధికపై నడ్డా మాట్లాడుతుండగానే చాలా మంది  సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో సభలో జనం కన్నా ఖాళీ కుర్చలే ఎక్కువగా కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

 ఈ సభలో మాట్లాడిన నడ్డా.. ప్రధాని మోదీ సెక్యులర్ నేత అని  అన్నారు . దేశ సమగ్రతను కోరే ఒకే ఒక్క పార్టీ బీజేపీ అని అన్నారు. మోదీ పాలనలోనే భారత్ శక్తివంతంగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని స్కాంజలు, విధ్వంసాలేనన్నారు నడ్డా. జమ్మూకశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిన సమర్థవంతమైన లీడర్ మోదీ అని తెలిపారు. తాండ్ర వినోద్ కు మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశమివ్వాలని కోరారు నడ్డా.