ఎన్నికల ముందు ప్రజల్లో తిరుగుతారు. విపరీతంగా ప్రచారం చేస్తారు. గెలిపిస్తే ఎప్పటికీ అందరికీ అందుబాటులో ఉంటామని…నియోజయక వర్గ అభివృద్ధికి కృషి చేస్తామని హామీలు గుప్పిస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత …తాము ఓట్లు వేసి గెలిపించిన నాయకుడు అభివృద్ధిని పట్టించుకోక పోవడంతో జనం నిరసన వ్యక్తం చేస్తారు. ఇలాంటి ఘటన పంజాబ్ లో జరిగింది. మా ఎంపీ కన్పించడం లేదంటూ పోస్టర్లు వేశారు అక్కడి జనం. గుర్దాస్‌పూర్ నుంచి ఎంపీగా బరిలోకి దిగి ఘన విజయం సాధించిన సినీ నటుడు సన్నీ డియోల్.
ఎంపీగా గెలిచిన తర్వాత సన్నీ అక్కడి ప్రజలకు కన్పించి చాలా రోజులైందట. తమ ఇబ్బందులు తెలుపుకుందామంటే ఎక్కడ ఉంటారో…ఎప్పుడు వస్తారో తెలియక పోవడంతో … పఠాన్‌కోట్ ప్రాంతంలో సన్నీ డియోల్ ‘కనిపించడం లేదు’ అంటూ పోస్టర్లు వేశారు. గుంషుదా కీ తలాశ్(కనిపించని వ్యక్తి కోసం వెతుకుతున్నాము) అని రాసి ఉన్న పోస్టర్లు రైల్వే స్టేషన్ దగ్గర కొందరు వ్యక్తులు అంటించారు.
అయితే మిస్సింగ్ పోస్టర్లపై స్పందించిన కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ… ఇది కొత్తేమీ కాదన్నారు.