కాలిఫోర్నియా బీచుల్లో జనం జల్సాలు

కాలిఫోర్నియా బీచుల్లో జనం జల్సాలు

వీలైనంత వరకు పక్క వాళ్లకు దూరంగా ఉండాలని, ఒకరికొకరు కాంటాక్ట్‌‌ అవొద్దని, బయటకు వెళ్లొద్దని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సూచించినా జనం మాత్రం పెడచెవిన పెట్టారు. వీకెండ్‌‌ రోజున ఆ రాష్ట్రంలోని పార్కులు, బీచ్‌‌లలో జనం గుమికూడారు. లాస్‌‌ ఏంజెలిస్‌‌లోని బీచ్‌‌లలో జనం ఒకరికొకరు దగ్గరగా ఉన్న వీడియోలు సోషల్‌‌ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఆ సిటీలో ఆటలు, ఇతర రీ క్రియేషన్‌‌ సెంటర్లను మూసేస్తున్నట్టు ఆదివారం సాయంత్రం సిటీ మేయర్‌‌ ప్రకటించారు. బీచ్‌‌లలో పార్కింగ్‌‌ను క్లోజ్‌‌ చేస్తున్నామన్నారు. ‘ఇంట్లో ఉండండి అంటే బీచ్‌‌లలో తిరుగుతున్నారు. ఒక్క చోట గుమికూడుతున్నారు. ఇది సీరియస్‌‌ టైమ్‌‌. ఇండ్లల్లోనే ఉండండి. ప్రాణాలు కాపాడుకోండి’ అని లాస్‌‌ ఏంజెలెస్‌‌ మేయర్‌‌ ట్వీట్‌‌ చేశారు. లాస్‌‌ ఏంజెలెస్‌‌ పక్కనున్న శాంటా మోనికా కూడా బీచ్‌‌ పార్కింగ్‌‌ను క్లోజ్‌‌ చేస్తున్నట్టు ప్రకటించింది. దూరందూరంగా ఉండాలని ప్రజలకు మలిబు సిటీ అధికారులు సూచించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోనూ బీచ్‌‌లను, బోటింగ్‌‌ను రద్దు చేస్తున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు.