ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను పట్టించుకోండి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను పట్టించుకోండి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి

చేర్యాల, వెలుగు: చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో  డాక్టర్లు, నర్సింగ్ స్టాప్ లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే డాక్టర్లను నియమించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  మంగళవారం చేర్యాల సీహెచ్‌సీని ఎమ్మెల్యే సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రెండు నెలలుగా గైనిక్  డాక్టర్ లేక డెలివరీల కోసం పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  సీహెచ్‌సీలో  డాక్టర్లు, ఎక్విప్‌మెంట్ల కొరత ఉందన్నారు.

ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్,  బీఆర్‌‌ఎస్ నాయకులు మున్సిపల్  చైర్‌‌పర్సన్ ఎ. స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి, ఎం. నాగేశ్వరరావు, ఎ. మల్లేశం, యు. కర్ణాకర్, ఎం.బాలనర్సయ్య, పి. ఎల్లారెడ్డి, తాడెం రంజిత కృష్ణమూర్తి, ఎం. శ్రీధర్‌‌, కౌన్సిలర్లు కనకలక్ష్మీ యాదగిరి, సతీశ్ గౌడ్, ఎస్‌ అంజయ్య, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.