‘గాంధీ’ వద్ద బస్ షెల్టర్ లేక తిప్పలు

‘గాంధీ’ వద్ద బస్ షెల్టర్ లేక తిప్పలు
  • రోడ్డుపైనే బస్సులు ఎక్కుతున్న ప్రజలు
  • ప్రమాదాలు జరుగుతున్నా.. పట్టించుకోని అధికారులు 

పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖాన వద్ద బస్ షెల్టర్ లేక పేషెంట్లు, సహాయకులు, విజిటర్స్ ఇబ్బందులు పడుతున్నారు. గాంధీ హాస్పిటల్​ మెయిన్​ గేట్​వద్ద  భారీ సైజు గాంధీ విగ్రహం నెలకొల్పుతున్న సమయంలో అడ్డుగా ఉందని, బస్సు షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా తొలగించారు. దీంతో ఎండ, వానలో జనాలు బస్సు ఎక్కడానికి , దిగడానికి కష్టాలు పడాల్సి వస్తున్నది. కొంత కాలంగా గాంధీ హాస్పిటల్​ ముందు  బస్టాప్ ​స్థలం వద్ద ప్రైవేట్​కార్లు, ఆటోలు పెద్ద సంఖ్యలో పార్కింగ్ చేస్తున్నారు.

దీంతో ప్రయాణికులు నిలబడడానికి  కూడా స్థలం లేకుండా పోతోంది.  ప్రమాదకర స్థితిలో జనాలు బస్సుల కోసం నడి రోడ్డుపైనే వేచి ఉంటున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు, అధికారులు స్పందించి గాంధీ బస్టాప్​ ప్రాంతంలో అక్రమంగా పార్క్​ చేసే  వాహనాలను ఆపకుండా చూడాలని, గతంలో మాదిరిగా బస్సు షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.