యావత్ భారత్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకారమైన సంగతి తెలిసిందే. రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరారు. ఈ మహోత్తర కార్యక్రమాన్ని కళ్లారా చూడటానికి సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అచ్చం ఇదే తరహాలో ఇద్దరు డూప్లికేట్ క్రికెటర్లు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేశారు. వారిలో ఒకరు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కాగా, మరొకరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.
భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ పోలిఉండేలా గెటప్ వేసుకొని ఓ అభిమాని అయోధ్యకు విచ్చేశాడు. దీంతో అతనితో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. నడిరోడ్డుపై కూడా అతన్ని విడిచిపెట్టలేదు. వదిలితే ఎక్కడకి పారిపోతడేమో అన్నట్లు అతని షర్ట్ పట్టుకొని మరీ వెంబడించారు. మరికొందరైతే అతని ఒంటిపై చేతులేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అతని చుట్టూ చేరి వీలైనన్నీ ఫోటోలు దిగాక విడిచిపెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The people gathering and clicking selfie with Virat Kohli's duplicate in Ayodhya today.
— CricketMAN2 (@ImTanujSingh) January 22, 2024
- Imagine if King Kohli was in Ayodhya today, He is people's favourite! ?pic.twitter.com/dqk7VAodh6
మితిమీరిన అభిమానం..!
డూప్లికేట్ కోహ్లీ బాధలు చూసి నెటిజెన్స్ అతనిపై జాలి పడుతున్నారు. అతనికి ఇష్టం లేకపోయినా ఇబ్బందిపెట్టారని సాఫ్ట్ కార్నర్ చూపేవారు కొందరైతే.. మితిమీరిన అభిమానం పనికిరాదని బుద్ధి చెప్తున్నవారు మరికొందరు. ఏదేమైనా రామ మందిర ప్రాణ ప్రతిష్ట రోజు నానా పాట్లు పడ్డాడనేది డూప్లికేట్ కోహ్లీకి మరిచిపోలేని ఓ తీపి జ్ఞాపకం.