కాలమేదైనా తాగేందుకే చెలిమె నీళ్లే..

ఈ చిత్రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని వాగులోనిది. కాలం ఏదైనా ఇక్కడ ప్రజలు వాగులో చెలిమె నీటినే తాగుతున్నారు. మహిళలు, యువతులు చెలిమెల్లో నీళ్లు తోడి బిందెలు, క్యాన్లలో నింపుకొని వెళ్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా అవి మురికిగా ఉంటున్నాయని, తాగడం ఇబ్బందిగా ఉంటోందంటున్నారు. వాగులో చెలిమి నీళ్లే తమకు అలవాటయ్యాయని చెప్తున్నారు.

వెలుగు, కాగజ్ నగర్